ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారును తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ కారులో రూ.4 కోట్ల నగదు, కొంత బంగారం లభించింది. ఈ కారు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కాగా, దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.. ఆ డబ్బులకు, ఆ కారుకు తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ కారు మీద ఉన్న స్టిక్కర్ జిరాక్స్ తీసి అంటించి ఉందన్నారు. అది తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉందని, ఆ డబ్బు తనది కాదని స్పష్టం చేశారు. తనకు అసలు సంబంధమే లేదన్నారు.