టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయంగా పార్టీని పైకి తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం గట్టిగా ఉండటం తో సోషల్ మీడియాలో చంద్రబాబుని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. మా బాబు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ టైంలో ఎలా ఉండేదో తెలుసా అంటూ నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు మద్దతు తెలిపే మీడియాలో సీఎం చంద్రబాబు గురించి ఐదు నిమిషాలకు ఒకసారి పుంఖానుపుంఖాలుగా యాడ్స్ మరియు పొగడ్తలు ప్రశంసలు కురిపిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారట.
అప్పట్లో హుదూద్ తుఫాన్ ని ఓడించాడు ఇప్పుడు వైరస్ తో పోరాడుతున్నాడు ప్రకృతి తో చంద్రబాబు యుద్ధం చేస్తున్నాడు అంటూ మీడియా తెగ ఊదరగొట్టేదని…నెటిజన్లు చంద్ర బాబు పై సెటైర్లు వేస్తున్నారు. మొత్తంమీద ప్రస్తుత పరిస్థితుల్లో ఒకపక్క స్థానిక ఎన్నికల టైంలో జంపింగ్ జపాంగ్ నాయకుల దెబ్బ మరోవైపు సోషల్ మీడియాలో కరోనా వైరస్ దెబ్బ గట్టిగానే రగులుతోంది బాబు గారికి.