నాగార్జున వల్లే కొడుకు అఖిల్ కి ఫ్లాపులొస్తున్నాయట ..ఇదీ అసలు సంగతి ..!

-

అక్కినేని ఫ్యామిలీ మొత్తం జీవితాంతం మర్చిపోలేని మధురానుభూతి ‘మనం’ సినిమా. ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరోలైన నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతీ తెలిసిందే. అయితే అంతకంటే గొప్ప విషయం మనం సినిమా ఏ.ఎన్.ఆర్ కి ఆఖరి సినిమా కావడం. అందులోను తన కొడుకు మనవళ్ళ తో కలిసి నటించడం. ఇక ఇదే సినిమాలో క్లైమాక్స్ లో అఖిల్ ఎంట్రీ సూపర్బ్ అనిపించింది. ఆ ఎంట్రీ చూసిన ప్రతీ ఒక్కరు అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. కాని అది సాధ్యమేనా అని ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

అంతేకాదు అఖిల్ కూడా సుమంత్, సుశాంత్ ల మాదిరిగానే మిగిలిపోతాడేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం అఖిల్ హీరోగా నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. ఇక ప్రస్తుతం అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుస ప్లాపులలో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సారి హిట్టు కొట్టాల్సిందే అన్న కసి తో ఉన్నారు అటు హీరో అఖిల్, ఇటు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్.

ఇక తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ లోకి కింగ్ నాగార్జున ఎంటరయ్యారని తెలుస్తుంది. ఎడిటింగ్ లో ఉన్న మైనస్ ల వల్లే ఇంతకుముందు అఖిల్ సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి అని నాగార్జున ఫీలయ్యారట. అందుకే ఈసారి నాగార్జున దగ్గరుండి మరీ సినిమాకి ఎడిటింగ్ చేపిస్తున్నాడని అంటున్నారు. అయితే అఖిల్ గత మూడు సినిమాలకి నాగార్జున దగ్గరుండి అన్ని విషయాలు చూసుకున్నప్పటికి ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా కూడా ఈ సారి అలా జరగకూడదని పక్కా అఖిల్ కి హిట్ పడాలని నాగార్జున ఎడిటింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమాని రెడీ చేయిస్తున్నాడట. మరి నాగార్జున తాపత్రయం ఫలిస్తుందా .. లేదా అన్నది కొన్నాళ్ళలో తెలియనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version