poonam pandey పూనం పాండే శృంగార ప్రియులకు బాగా పరిచయమున్నపేరు. చేసింది నాలుగు సినిమాలే అయినా పాపులారిటీ మాత్రం బాగానే ఉంది. నషా, ఆగయా హీరో, ద జర్నీ ఆఫ్ కర్మ సినిమాలతో పాటు ది వీకెండ్ అంటూ చేసిన హాట్ హాట్ షాట్ ఫిలిం కూడా చేసింది. తన అభిమానులను ఏమాత్రం నిరుత్సాహ పరచదు ఈవిడ. కొన్ని అడల్ట్ వెబ్‌సైట్లలో తన ఏకాంత వీడియోలతో కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది. అసలు విషయానికి వస్తే…
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ బాయ్ ఫ్రెండ్‌తో షికారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డట్లు సమాచారం. ఆదివారం రాత్రి 8.05 గంటల సమయంలో బిఎమ్‌డబ్ల్యూ కారులో తిరుగుతున్న పూనమ్ పాండేను గుర్తించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు ఆమొతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూనమ్ స్నేహితుడు చిత్ర దర్శకుడు సామ్ అహ్మద్ బాంబే(46)గా గుర్తించారు. వీరిద్దరిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని 188, 269, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. వీరు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేసిన పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని, సొంత పూచికత్తుమీద విడుదల చేసినట్లు తెలుస్తుంది.
అయితే గత కొంతకాలంగా పూనమ్, సామ్ అహ్మద్ డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. పూనమ్ ఏం చేసినా సెన్షేషనే.. కరోనా వైరస్ ప్రభావం ఇంతగా చూపుతున్న తరుణంలో సామాజిక బాధ్యత మరచి ఇలా చెయ్యడం బాధ్యతా రాహిత్యమే.. ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి.