లక్ష్మీపార్వతి తనకు పంపిన వాట్సప్ మెసేజ్‌లు, ఇతర ఆధారాలను ఆయన పోలీసులకు సమర్పించాడు. అంతే కాదు.. తనను వైఎస్సార్సీపీలో చేరాలని లక్ష్మీపార్వతి ఒత్తిడి చేసినట్లు..
ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఏపీలో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతిపై లైంగిక ఆరోపణల కేసు నమోదయింది. ఆమె అనుచరుడు కోటి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఆమెపై ఫిర్యాదు చేశాడు.
లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ ఆయన ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కోటి పోలీసులకు అందజేశాడు. లక్ష్మీపార్వతి తనకు పంపిన వాట్సప్ మెసేజ్‌లు, ఇతర ఆధారాలను ఆయన పోలీసులకు సమర్పించాడు. అంతే కాదు.. తనను వైఎస్సార్సీపీలో చేరాలని లక్ష్మీపార్వతి ఒత్తిడి చేసినట్లు.. జగన్‌తో మాట్లాడి మంచి పదవి ఇప్పిస్తానని ఆమె తనను ప్రలోభపెట్టినట్టు కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.