బిగ్ బ్రేకింగ్ : మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు చేయండి..!

-

తనను అసభ్య పదజాలంతో దూషించినందుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చిత్తూరు జిల్లాకు చెందిన జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ గురువారం బి.కొత్త కోట ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స తీసుకుంటే అవహేళన చేశారని. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులను అవమానకరంగా సంబోధించడం నేరమవుతుందని సుప్రీంకోర్టే పేర్కొంది. అయితే ఈ నెల 16న జరిగిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఈ నేపధ్యంలోనే ఆయనపై అట్రాసిటీ కేసు పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణపై పది రోజుల క్రితం దాడి జరిగింది. ఐతే ఈ దాడికి మంత్రి పెద్దిరెడ్డి సహకారముందని ఆయన గతంలోనే ఆరోపించారు. మంత్రికి సమీప బంధువైన ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందునే.. తనను పెద్దిరెడ్డి టార్గెట్ చేశారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version