మంచు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే.మంచు మనోజ్, విష్ణు,మోహన్ బాబు మధ్య ఆస్తి తగాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్ తనపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.అనంతరం విష్ణు సైతం మనోజ్ మీద కేసు పెట్టారు.
ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటికి వివరాల కోసం వెళ్లిన జర్నలిస్టుపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ దరఖాస్తు చేయగా.. హైకోర్టు నిరాకరించింది. దీంతో మోహన్ బాబు సోమవారం సుప్రీం కోర్టులో బెయిల్ దాఖలు చేసినట్లు సమాచారం.