KTR: కేటీఆర్ కు మరోసారి నోటీసులు !

-

KTR: కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ రెడీ అవుతోందట. ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. గతంలోనే నోటీసు ఇచ్చిన అధికారికి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు కేటీఆర్. ఏసీబీ అడిషనల్ ఎస్పీకి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు కేటీఆర్. లాయర్ సమక్షంలో విచారణ చేయమని కోరిన కేటీఆర్.. లాయర్‌ను లోపలి అనుమతించలేదు ఏసీబీ. ఈ కేసుకు సంబందించిన తన స్టేట్మెంట్‌ను లెటర్ ద్వారా అందించారు కేటీఆర్.

ACB is getting ready to give notices to KTR once again

అక్నాలెడ్జ్ చేసినట్లు రిప్లై ఇచ్చిన ఏసీబీ.. ఇప్పుడు త్వరలోనే… కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోందట. కేటీఆర్ లేఖ పై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న ఏసీబి అధికారులు…. దర్యాప్తు కు సహకరించాలని హైకోర్టు ఆర్డర్ లో ఉన్న కేటీఆర్ విచారణకు రాకపోవడం పై లీగల్ ఒపీనియన్ తీసుకుంటోందట. కేటీఆర్ దర్యాప్తునకు సహకరించడం లేదన్న విషయాన్ని హైకోర్టు ముందు ప్రస్తావించానుందట ఏసీబీ. తదుపరి లీగల్ చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఏసీబీ..నోటీసులు ఇవ్వనుందట.

Read more RELATED
Recommended to you

Latest news