ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై కేసు నమోదు

-

మల్కాజిగిరి టీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్షన్స్ 307, 323, 324,143,147,149 కింద కేసులు నమోదు చేశారు మల్కాజిగిరి పోలీసులు. మైనంపల్లి హనుమంతరావు మరియు మరో 15 మంది కార్యకర్తల పై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక అటు తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు రేపు బంద్ ప్రకటించారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు.

ప్రతి ఒక్కరు శ్రవణ్ పై దాడికి నిరసనగా బంద్ లో పాల్గొనాలని రామచందర్ రావు పిలుపు నించారు. ఇక అంతకు ముందు బండి సంజయ్ పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. అరేయ్ గుండుగా అంటూ సంభోదించిన ఎమ్మెల్యే మైనంపల్లి.. బండి సంజయ్ ఓ హుమనైజర్ అని మండిపడ్డారు. “నా ముందు బండి సంజయ్ ఓ బచ్చా. మైనంపల్లి కోసం అన్ని జిల్లాలు కలిసి వస్తాయి… మైనంపల్లి అంటే అందరికి హడల్.” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version