బైజూస్ యజమానిపై కేసు నమోదు

-

ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ కంపెనీ యజమాని పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ సిలబస్‌ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారనే ఆరోపణలతో బైజూస్‌ యజమాని రవీంద్రన్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. క్రిమోఫోబియా అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్‌ 69 (ఎ) కింద జూలై 30 న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ముంబై పోలీసులు పేర్కొన్నారు.

బైజూస్‌ కంపెనీ యూపీఎస్‌సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్‌ ధాల్‌ ఆరోపణలు చేశారు. యూపీఎస్‌సీ ప్రిపరేటరీ మెటీరియల్‌ లో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ను యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ట్రాన్స్‌ నేషనల్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కు నోడల్‌ ఏజెన్సీగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఈ-మెయిల్‌ పంపాలని పేర్కొన్నారు. అయితే.. బైజూస్‌ కంపెనీ సమాధానంపై సంతృప్తికరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version