సాధారణంగా ఏపీ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువ ఉంటుంది గానీ, తెలంగాణ రాజకీయాల్లో అంతగా ఉండేది కాదు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా కులాల మీద ఆధారపడే రాజకీయాలు నడిచే పరిస్తితి వచ్చింది. తెలంగాణ విడిపోయి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.
అందుకే కేసీఆర్ రెండుసార్లు సులువుగా అధికారంలోకి వచ్చారు…కానీ ఈ సారి అటు కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీలో ఈటల రాజేందర్ ప్రభావంతో కుల సమీకరణాలు పూర్తిగా మారినట్లు కనిపిస్తున్నాయి. పైగా కేసీఆర్ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఒరిగింది లేదు…ఇక అటు ఈటల ఎలాగో బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో…బీసీల్లో కొన్ని వర్గాలు బీజేపీ వైపుకు వెళ్ళేలా ఉన్నాయి. ముఖ్యంగా ముదిరాజ్‌లు. అటు గౌడ వర్గం కాంగ్రెస్ వైపుకు వచ్చేలా ఉంది. అలాగే ఈ సారి రెడ్డి వర్గం పూర్తిగా రేవంత్‌కు మద్దతు ఉండేలా ఉంది.
ఇక గతంలో టీడీపీలో కీలకంగా ఉండే కమ్మ వర్గం..ఆ తర్వాత కేసీఆర్‌కు సపోర్ట్ ఇచ్చింది…కానీ ఇప్పుడు రేవంత్ ప్రభావంతో వారు…కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో కాంగ్రెస్‌కే ఎక్కువ మద్ధతు ఉంది. వారిని తిప్పుకోవడానికి దళితబంధుని కేసీఆర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికైతే రేవంత్, ఈటల ప్రభావం వల్ల కేసీఆర్‌కు డ్యామేజ్ గట్టిగానే జరిగేలా ఉంది.