తిరుపతిలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం లో జగన్ కేంద్రం పై కాస్త ఫైర్ అయినట్లు అనిపించింది. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని.. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
విభజనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి
వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు.
పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. రీసోర్స్ గ్యాప్‌నూ భర్తీచేయలేదని.. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదన్నారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట ఇవ్వాలని.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.