స్నేహం అంటే ఇదే.. ఒక చెల్లెలి కోసం 32 మంది అన్నయ్యలు ఏం చేసారంటే…!

-

స్నేహితుడు అనే వాడు ఎప్పుడు అండగా ఉండాలి… అప్పుడే స్నేహం అనే పదానికి అర్ధం ఉంటుంది… ఫ్రెండ్ అని చెప్పడం వేరు, కష్టాల్లో ఉన్న వాడిని ఆదుకోవడం వేరు, చాలా మంది మేము కష్టం వస్తే మీ వెంటే నడుస్తాం, ఆదుకుంటామని… కథలు చెప్తూ ఉంటారు.. ప్రాణం మీదకు వచ్చినప్పుడు వందలో 90 మంది పక్కకు తప్పుకోవడం అనేది మనం చూస్తున్నాం… ఇక మరికొందరు అవసరానికి వాడుకుని కష్టాల్లో ఉన్నప్పుడు దూరంగా ఉండటం కూడా మనకు కనపడుతూ ఉంటుంది.

తాజాగా కేరళలో… అసలు స్నేహం అంటే ఎలా ఉంటుందో చూపించారు కొందరు స్నేహితులు… కష్టాల్లో ఉన్న తమ స్నేహితురాలిని ఆదుకోవడానికి 32 మంది అన్నయ్యలు ముందుకి వచ్చారు. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న గోకులం క్యాటరింగ్ కాలేజిలో… చదువుతున్న ఆరోమల్ సోదరి ఐశ్వర్య… కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు… దీనితో అతని క్లాస్ మేట్స్ ఆమె కోసం ముందుకి వచ్చారు. దీనితో వైద్యులు… 23 ఏళ్ళ ఐశ్వర్యకు… కిడ్నీ మార్చాలని సూచించారు.

ఆమెకు కిడ్నీ దానం చేయడానికి గానూ… ఆమె బంధువుల్లో ఒకరు ముందుకి వచ్చారు… అయితే ఆ ఆపరేషన్ చేయడానికి మాత్రం 20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో… ఆరోమల్ ఫ్రెండ్స్ 32 మంది కలిసి జాతీయ రహదారి సమీపంలో ఒక హోటల్ ని మొదలుపెట్టారు… దోశ, చపాతీ, ఆమ్లెట్‌తో పాటు నాన్‌వెజ్ వంటకాలను విక్రయిస్తున్నారు. హోటల్ ద్వారా 5 వేల వరకు రోజు లాభం వస్తుందని… త్వరలోనే తాము 20 లక్షలు ఇతర విరాళాల రూపంలో కూడా సేకరించి ఆమెకు వైద్యం చేయిస్తామని… సాయం చేసే వారు కూడా ముందుకి రావాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version