జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాదులో వాతావరణం వాడి వేడి గా మారిపోయింది. అన్ని పార్టీల నేతలు ప్రస్తుతం ఓటర్లను ఆకట్టుకునేందుకు… ప్రజలకు చెంత వాలిపోయారు. తమను గెలిపిస్తే ఏం చేస్తామో అనేది చెబుతూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందేm ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
ఈ నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తుండడంతో భారీగా హవాలా నగదు పట్టుబడుతోంది. ఇక తాజాగా దీనిపై స్పందించిన సీపీ అంజనీ కుమార్ అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదు తో పట్టుబడితే నగదును సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. 50వేల కంటే ఎక్కువ నగదు ఉన్నప్పుడు తప్పనిసరిగా రశీదు ఉండాలని లేకపోతే సీజ్ చేస్తాము అని అంతేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.