ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సీఎం జగన్ మోహన్‌రెడ్డి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లను సీబీఐ కోర్టు ఆదేశించింది. ఇక అంతకు ముందు సీబీఐ కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్నది. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేశాడని..సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కోర్టు ముందు విన్నవించారు.
అంతేకాదు… సాక్షులు ప్రభావితం చేస్తున్నారని పిటిషనర్ ఆరోపణలపై ఆధారాలు చూపాలని జగన్ తరుఫు న్యాయవాదులు… ఈ పిటిషన్ కు అర్హత లేదని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్ వేసినందున తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని రఘరామ రాజు తరఫు న్యాయవాది శ్రీ వెంకటేశ్ కోర్టు ముందుకు తెచ్చారు. కేసులో సాక్షులుగా ఉన్న అధికారులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభ పెడుతున్నారని వారు వివరించారు. ఇక ఇరువురి వాదనలు విన్న సీబీఐ కోర్టు… తదుపరి విచారణ ఈ నెల 8 కి వాయిదా వేసింది.