వివేకా హత్య కేసులో సిబిఐ ఎలాగైనా త్వరగా ముగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఇప్పుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సైతం అరెస్ట్ చేయాలని ఉద్దేశ్యంతో ఎంత ప్రయత్నిస్తున్నా .. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్యన వాయిదాపడుతూ వచ్చింది. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న సిబిఐ తాజాగా మళ్ళీ కేసును మూవ్ చేసే పనిలో పడింది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సిబిఐ కోర్ట్ వేగవం చేయాలన్న కోణంలో అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. ఎటువంటి పరిస్థితుల్లో ఆఆగుస్ట్ 14వ తేదీన కోర్టుకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. కాగా ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి , వైఎస్ భాస్కర రెడ్డి మరియు ఉదయ్ కుమార్ రెడ్డి లపైనా ఒక ఛార్జ్ షీట్ ను ఫైల్ చేసింది. కాగా ఇప్పటి వరకు జరిగిన విచారణల తర్వాత అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసులో ఎనిమిదవ నిందితుడిగా ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది.
మరి అవినాష్ రెడ్డి నోటీసులో తెలిపిన ప్రకారం కోర్టుకు ఆగష్టు రెండవ వారంలో హాజరు అవుతాడా లేదా వేరే ప్లాన్ లను అమలు చేసే పనిలో ఉంటాడా అన్నది తెలియాలంటే అప్పారు వరకు ఆగాల్సిందే.