రేపు వరంగల్, హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

-

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి  రేపు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. హన్మకొండ ఐడీఓసీ కార్యాలయంలో జరిగే వనమహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్ట్, కాళోజీ కళాక్షేత్రం తదితర అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత కాకతీయ మెగా జౌళి పార్కు, నయీంనగర్ నాలా తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు.

వరంగల్ సమీక్ష సమావేశానికి కావలసిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ఆదేశించింది. అండర్ డ్రైనేజీ పనులు, ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధి, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులతోపాటు కూడా పరిధిలో ఉన్న పెండింగ్ పనులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తర తెలంగాణ అంతా వరంగల్ వైపు చూసేలా నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news