Breaking : గాలి జనార్థన్‌ రెడ్డికి సీబీఐ షాక్‌

-

గ‌నుల త‌వ్వకాల్లో అక్రమాల‌కు పాల్ప‌డ్డారంటూ క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డిపై న‌మోదు చేసిన కేసులో గురువారం ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ న‌మోదు చేసిన ఈ కేసులో చాలా కాలం పాటు జైల్లోనే ఉన్న జ‌నార్ధ‌న్ రెడ్డి… సుప్రీంకోర్టును ఆశ్రయించి ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ తీసుకుని విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం త‌న సొంతూరు బ‌ళ్లారిలోనే ఉంటున్న జ‌నార్ధ‌న్ రెడ్డి బెయిల్‌పైనే ఉన్నారు. ఈ క్ర‌మంలో జ‌నార్ధ‌న్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాల‌ని కోరుతూ సీబీఐ గురువారం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

ఈ పిటిష‌న్‌లో జ‌నార్ధ‌న్ రెడ్డికి సంబంధించి సీబీఐ అధికారులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ కేసులో జ‌నార్ధ‌న్ రెడ్డి సాక్షుల‌ను బెదిరిస్తున్నార‌ని ఆరోపించిన సీబీఐ… మొత్తం కేసునే ఆయ‌న ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నార‌ని కోర్టుకు తెలిపారు. ప‌దే ప‌దే డిశ్చార్జీ పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేస్తున్న నిందితులు.. కేసు విచార‌ణ ముందుకు సాగ‌కుండా అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని ఆరోపించారు సీబీఐ అధికారులు. ప్ర‌స్తుతం బ‌ళ్లారిలో ఉంటున్న జ‌నార్ధ‌న్ రెడ్డిని అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు పంపించాల‌ని కూడా సుప్రీంకోర్టును కోరారు సీబీఐ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version