సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్. విద్యార్థుల పాఠాల ప్రణాళిక భారాన్ని విద్యార్థులపై తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ఇందుకుగాను 9 నుండి 12 తరగతుల మధ్య ఉండే సిలబస్ లో కొన్ని పాఠ్యాంశాలను తగ్గించడానికి సీబీఎస్సీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏకంగా 30 శాతం సిలబస్ తగ్గించే విధంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ తెలియజేశారు. ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ నడుమ విద్యార్థులు పాఠశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేదు. నిజానికి ఈ విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందనే అంశంపై కూడా స్పష్టత లేదు.
మన దేశ వ్యాప్తంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులవల్ల పాఠ్య ప్రణాళికలను సవరించే విధంగా సీబీఎస్సీ ప్రయత్నం చేసింది. ఇందులో 9 నుంచి 12 తరగతుల మధ్య ఉండే సిలబస్ ను తగ్గించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కొంతమంది విద్యా రంగ నిపుణుల సలహాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకు గాను ఏకంగా 15 వందల మంది సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది.