Breaking : గూగుల్‌కు భారత్‌ భారీ జరిమానా

-

ఆండ్రాయిడ్ మొబైళ్ల వినియోగంలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా వడ్డించింది. గూగుల్‌కు ఏకంగా రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించింది సీసీఐ. అంతేకాదు, గూగుల్ తన ప్రవర్తనను మార్చుకోవాలని సీసీఐ ఆదేశించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాలను తక్షణం కట్టిపెట్టాల్సిందిగా గూగుల్‌ను ఆదేశించినట్టు తెలిపింది సీసీఐ.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఫోన్లు, టాబ్లాయిడ్‌లలో అత్యధిక శాతం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసేవే. దీనిని గూగుల్ అభివృద్ధి చేసింది. అయితే, దీనిని ప్రీ ఇన్‌స్టాలేషన్ కోసం గూగుల్‌కు చెందిన యాప్‌లలో నుంచి ఎంపిక చేసుకోకుండా ఓఈఎం (తయారీదారులు)లను నియంత్రించకూడదని సీసీఐ ఆదేశించింది. అలాగే, యాప్‌లన్నింటినీ స్మార్ట్‌ఫోన్లలో గంపగుత్తగా ప్రీ ఇన్‌స్టాల్ చేసుకోవాలని బలవంతం చేయకూడదని కూడా గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version