రెండు తెలుగు రాష్ట్రాల్లో తనను 139 మంది అత్యాచారం చేసారు అని ఒక మహిళ ఫిర్యాదు చేసిన అంశం గుర్తుండే ఉంటుంది. ఇక సంచలనం సృష్టించిన ఈ అత్యాచారం కేసులో డాలర్ భాయ్ ని అరెస్టు చేసారు సిసిఎస్ పోలీసులు. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో ఆమె ఫిర్యాదు చేసారు. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేసారు.
ఈ కేసులో సినీ నటులపై కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఈ కేసు ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించిన పోలీసులు కొంత సమాచారం రాబట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గా డాలర్ బాయ్ ని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేడు రిమాండ్ కి అతన్ని తరలించి విచారిస్తారు.