దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

-

దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ అండ్ మర్డర్ కేసు రిమాండ్ రిపోర్ట్ కీలక అంశాలు నోట్ చేశారు పోలీసులు. నిందితుడు సంవత్సరం నుండి డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్ వాడుతున్నట్టు గుర్తించారు. తన గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేసేందుకు సదరు యాప్ ను సంవత్సరం నుండి ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. అదే యాప్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు మంద సాగర్. నిందితుడు మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా యాప్ ద్వారా కాల్స్ చేయటంతో పోలీసులకు బాలుడి ఆచూకీని కనుగొనడం సవాలుగా మారింది. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్దామని చెప్పి బాలుడిని సాగర్ తీసుకు వెళ్లినట్టు గుర్తించారు. తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే బాలుడు వెళ్ళడని తెలుస్తోంది.

అప్పటికే స్థానిక మెడికల్ స్టోర్ నుండి రెండు నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. మార్గమధ్యంలో ఒక చోట మంచినీళ్లు తాగెందుకు ఆపిన నిందితుడు, ఆ మంచి నీళ్లలోనే నిద్రమాత్రలు వేశాడు. బాబు మత్తులోకి జారుకునీ స్పృహ వచ్చేలోపు హత్య చేశాడు. ఒక చౌరస్తా దగ్గరికి బాలుడు తండ్రి రమ్మని చెప్పి షాపులో నుండి రంజిత్ రెడ్డి కదలికలను గమనించిన నిందితుడు, మఫ్టీలో పోలీసులు ఫాలో అవుతున్నారు అన్న అనుమానంతో మళ్లీ యాప్ నుండి రంజిత్ రెడ్డికి ఫోన్ చేసి వేరే చోటకు రమ్మన్నాడు. హత్య చేసిన వెంటనే మనోజ్ రెడ్డి ఇంటికి బాలుడి తలిదండ్రుల రియాక్షన్ చూసేందుకు కూడా వెళ్లినట్టు గుర్తించారు. తల్లిదండ్రులు కిడ్నాప్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే లోపే బాలుడిని మంద సాగర్ హత్య చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version