మధ్యాహ్నం అధికారులతో కేసీఆర్‌ సమీక్ష..పంటల కొనుగోలు, యాసంగిలో సాగు విధానంపై చర్చ.

-

నేడు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు..పంటల కొనుగోలు, యాసంగిలిలో సాగు విధానంపై మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖామంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొంటారు. వానాకాం పంటల కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. గత వారం తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పంటలపై కీలకంగా చర్చించనున్నారు..తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విషయంలో సమీక్షలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి..
అకాల వర్షాలతో నష్టపోయినా రైతులు మరోసారి యాసంగిలో నష్టపోకుండా మొక్కజొన్న సాగుపై విధాన నిర్ణయం తీసుకుంటారు. గత ఏడాది ఎన్ని ఎకరరాల్లో మక్కలు వేశారు.. వాటికి ఎంత ధర వచ్చింది. తదితర వివరాలను సమావేశానికి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను అదేశించారు. యాసంగిలో మక్కల సాగు లాభమా నష్టమా అన్నఅంశంపై కూడా చర్చించి నిర్ణయం కీలక తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version