ఏపీటీడీసీలో ఓ ఉద్యోగి రాసలీలల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ APTDC ఆఫీస్‌లో రాసలీలల వ్యవహారం బయటకు రావడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఓ సీనియర్ అధికారి కొన్నిరోజులుగా రాత్రిళ్లు ఒక మహిళలతో కార్యాలయానికి వచ్చి గదిలో ఏకాంతంగా గడిపి వెళ్తున్నారని సమాచారం.
ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా అతడి బాగోతం బయటపడిందని తెలుస్తోంది. దీంతో సదరు ఉద్యోగిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే, ప్రభుత్వ అధికారుల నేర చర్యలపై ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
ఏపీటీడీసీలోని కీలక ఉద్యోగి రాసలీలలు
విజయవాడ APTDC ఆఫీస్‌లో రాసలీలల వ్యవహారం బయటపడింది. ఓ సీనియర్ అధికారి కొన్నిరోజులుగా రాత్రిళ్లు ఒక మహిళలతో కార్యాలయానికి వచ్చి గదిలో ఏకాంతంగా గడిపి వెళ్తున్నారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీసీటీవీ… pic.twitter.com/s1s52INrR8
— ChotaNews App (@ChotaNewsApp) May 4, 2025