మిస్ వరల్డ్ పోటీలపై ప్రత్యేక నిఘా.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

-

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గల గచ్చిబౌలి స్టేడియం వేదికగా మిస్ట్ వరల్డ్-2025 పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీలు ఈ నెల 10వ తేదీన గచ్చిబౌలిలో ప్రారంభం కానున్నాయి. అయితే, మిస్ వరల్డ్ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రత్యేక నిఘాను రాష్ట్ర పోలీసు శాఖ ఏర్పాటు చేసింది.

నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీందర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల భద్రతకు మహిళా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలను సైతం చేపట్టారు.రాచకొండ, హైదరాబాద్ ,సైబరాబాద్ కమిషనరేట్స్‌తో సహా మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే జిల్లాల్లో హైసెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.. సీనియర్ పోలీసు అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news