మరో భారీ చోరీ.. రెండున్నర కోట్ల విలువైన సెల్ ఫోన్లు కొట్టేశారు !

-

మెదక్ జిల్లా చేగుంట మండలం మాసాయిపేట దగ్గర కంటైనర్ లో సెల్ ఫోన్లు చోరీ గురయినట్టు గుర్తించారు. రెండున్నర కోట్ల విలువైన 2400 సెల్ ఫోన్లు చోరీ అయ్యాయి. ఈ నెల 14న చెన్నై నుంచి ఢిల్లీకి రెండు కంటైనర్లు బయల్దేరాయి. అందులో 15వ తేదీన గుంటూరులో ఒక కంటైనర్ లో సెల్ ఫోన్లు చోరీ జరిగింది. మరో కంటైనర్ ఈనెల 18న 44వ నెంబర్ జాతీయ రహదారి మాసాయిపేట దగ్గర ఆగింది. అయితే ఆ తరువాత కంటైనర్ ని పరిశీలించకుండా నిజామాబాద్ వరకు వెళ్ళాడు కంటైనర్ డ్రైవర్.

అక్కడికి వెళ్ళాక కంటైనర్ లో సెల్ ఫోన్ లు చోరీకి గురయినట్టు గుర్తించారు. కేసు ఎక్కడ నమోదు చేయాలి అనే అంశంపై గత నాలుగు రోజుల నుండి రెండు జిల్లాల పోలీసుల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. అయితే కంపెనీ ప్రతినిధులు జోక్యంతో చేగుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కంపెనీ ప్రతినిధులు కంటైనర్ కు జిపిఎస్ అమర్చినట్టు తెలుస్తోంది. దాన్ని బట్టే మాసాయిపేట దాబా దగ్గర 40 నిమిషాలు ఆగినట్లు గుర్తించి చేగుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version