కేంద్రం మున్సిపాలిటీల‌కు ఒక్కో క‌రోనా పేషెంట్ చికిత్స‌కు రూ.1.50 ల‌క్ష‌లు ఇస్తుందా..? నిజ‌మెంత‌..?

-

క‌రోనా నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ప్రచార‌మ‌వుతున్న ఫేక్ వార్త‌ల‌కు అడ్డు, అదుపూ లేకుండా పోయింది. క్ష‌ణ క్ష‌ణానికి అందులో ఫేక్ వార్త‌లు షేర్ అవుతూనే ఉన్నాయి. దీంతో అస‌లు వార్త ఏదో, ఫేక్ ఏదో తెలుసుకోవ‌డం జ‌నాల‌కు కూడా క‌ష్టంగా మారింది. ఇక తాజాగా మ‌రొక ఫేక్ వార్త సోషల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తోంది.

center giving rs 1.5 lakhs each corona patient to municipalities is it true

కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని అన్ని మున్సిపాలిటీల‌కు ఒక్కో క‌రోనా పేషెంట్ చికిత్స‌కు గాను రూ.1.50 ల‌క్ష‌ల‌ను ఇస్తుంద‌ని, అందువ‌ల్లే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌ని, సాధార‌ణ జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు ఉన్నా దాన్ని కోవిడ్‌గా చిత్రీక‌రించి మున్సిపాలిటీలు ఒక్కొక్క‌రికి రూ.1.50 ల‌క్ష‌ల చొప్పున కేంద్రం నుంచి నిధులు పొందుతున్నాయ‌ని.. వార్త‌లు ప్రచార‌మ‌వుతున్నాయి. అయితే ఈ వార్త‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని వెల్ల‌డైంది.

 

కేంద్రం ఒక్కో కరోనా పేషెంట్ చికిత్స‌కు రూ.1.50 ల‌క్ష‌ల చొప్పున మున్సిపాలిటీల‌కు అందివ్వ‌డం లేద‌ని, ఆ వార్త‌లో నిజం లేద‌ని, వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని అధికారులు హెచ్చ‌రించారు. నిజానికి అలాంటి ప్ర‌క‌ట‌నను ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం విడుద‌ల చేయ‌లేదు. క‌నుక ఫేక్ వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news