కేంద్రం కొత్త స్కీం.. భాగస్వామికి ఆర్థిక భద్రత..!

-

ప్రస్తుతం భారత మార్కెట్ లో పెట్టుబడి స్కీమ్స్ లు చాలానే అందుబాటులోకి వచ్చాయి. పదవీవిరమణ అయిన తర్వాత పీఎఫ్ పొందే విధంగా డబ్బులు పెట్టుబడి పెట్టుకునే సదుపాయం కూడా ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు కల్పిస్తున్నాయి. అయితే పదవీవిరమణ స్కీమ్స్ ద్వారా కస్టమర్లకు మాత్రమే కాకుండా తమ భాగస్వామికి కూడా ఆర్థిక భద్రత కల్పించే విధంగా కొత్త స్కీం అందుబాటులోకి వచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో కస్టమర్లు తమ భాగస్వామిని కూడా ఈ పెన్షన్ స్కీంలో చేర్పించుకోవచ్చు. ఎన్‌పీఎస్ స్కీం అనేది కేవలం పెన్షన్, పెట్టుబడి పథకానికి సంబంధించింది.

cash

పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ (పీఎఫ్ఆర్ డీఏ) నిర్వహణ బాధ్యతలను ఎన్‌పీఎస్ స్కీం నిర్వహిస్తోంది. మీ భాగస్వామి గృహిణి అయితే కస్టమర్లు బతికి ఉన్నంత కాలం ఆమె సంతోషంగా ఉంటుంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె పరిస్థితి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. కొడుకులు, కూతుర్లు మంచి వారైతే పర్లేదు. కాకపోతే ఏం చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. అలా అనుకున్నప్పుడు మీరు ఆమెకు ఎన్‌పీఎస్ స్కీంలో చేర్పించాలి. మీరు చనిపోయిన తర్వాత కూడా ఆమె ఎవరి మీద ఆధారపడకుండా ఉండేలా చూసుకుంటుంది. ఈ స్కీం ద్వారా మీ భాగస్వామికి భరోసా కల్పించడం జరుగుతుంది.

ఈ స్కీంలో జాయిన్ అవ్వాలని భావించే వాళ్లు తప్పని సరిగా పాటించాల్సిన నిబంధనలు. మీరు మీ భార్య పేరుపై ఎన్‌పీఎస్ ఖాతా తెరవాలి. ఆమెకు 30 ఏళ్లు నిండి ఉంటే.. నెలకు రూ.5,000 కడుతూ రావాలి. 10 శాతం వార్షిక రాబడితో మెచ్యూరిటీ కాలంలో (మీ భార్యకు 60 ఏళ్లు వచ్చినప్పుడు) మీ పెన్షన్ ఫండ్ మొత్తం రూ.1,11,98,471 అవుతుంది. ఇందులో మీరు రూ.44,79,388 పెట్టి యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేసుకోవాలి. యాన్యుటీ ప్లాన్‌పై 8 శాతం రాబడి ప్రకారం చూస్తే.. మీ భాగస్వామికి నెలకు రూ.44,793 వరకు పెన్షన్ వస్తుంది.

ఎన్‌పీఎస్ స్కీంలో చేరాలంటే వారు భారతీయులై ఉండాలి. వయసు 18-65 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఒక వ్యక్తి కేవలం ఒక అకౌంట్‌ను మాత్రమే కలిగి ఉండటానికి అర్హత ఉంటుంది. మీరు మీ భార్యకు ఆర్థిక భద్రత కల్పించాలని అనుకుంటే ఎన్‌పీఎస్ స్కీంలో జాయిన్ చేయించి నెలకు కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాలి. పెన్షన్ కాల పరిమితి ముగిసిన తర్వాత అధిక మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. నెలనెలా డబ్బులు డబ్బులు చేతికి వస్తే ఎలాంటి సమస్య లేకుండా సంతోషంగా గడపవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version