రోజురోజుకు శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్.. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎంతో మంది పై పంజా విసరడమే కాదు ప్రాణాలు కూడా బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర త్రివేది కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. కానీ అంతలోనే మళ్లీ అనారోగ్యం బారినపడిన ఆయన హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటూ చివరికి తుది శ్వాస విడిచారు.
జైపూర్ లో కరోనా వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత… కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయనను తీవ్ర ఆరోగ్య సమస్యలు వేధించాయని… ఆ తర్వాత ఎస్ ఎం ఎస్ దావకాన లో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక చికిత్స తీసుకుంటూ ఆయన ఆరోగ్యం విషమించిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చివరికి క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి చివరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా ఇప్పటి వరకూ ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే మృతిపై సీఎం అశోక్ గెహ్లాట్ నివాళులర్పించి ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.