ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం సీరియస్…!

-

కరోనా కట్టడి విషయంలో ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం ఆగ్రహంగా ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి లో ఉందని భావించినా సరే అనూహ్యంగా కేసులు పెరగడం చూసి కేంద్రం షాక్ అయింది. ఇక్కడ అసలు లాక్ డౌన్ అమలు లో ఉందా లేదా అనేది ఇప్పుడు కేంద్రానికి అర్ధం కావడం లేదు. రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు ఉన్నాయి.

లాక్ డౌన్ విజయవంతంగా అమలు జరిగితే కేసులు ఎందుకు పెరుగుతాయి అనేది కేంద్ర ప్రభుత్వ ప్రశ్న. ఇప్పుడు నిఘా వర్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సమాచారం సేకరించే పనిలో పడింది. అసలు రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయి…? పరిస్థితి ఏ విధంగా ఉంది…? రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఎన్ని కేసులు ఉన్నాయి…? ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు అనే వివరాలను కేంద్రం సేకరిస్తుంది.

అసలు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు బయటకు రావడం లేదని, లాక్ డౌన్ ని ఎప్పటికప్పుడు వీడియో కాలింగ్ ద్వారా పర్యవేక్షించాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రధాని కార్యాలయం దీని మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం ఏపీ మీద కన్నేసినట్టు తెలుస్తుంది. ఇక్కడి ఐఏఎస్ అధికారుల ద్వారా సమాచారం సేకరిస్తుంది. ఇక ఆరోగ్య సర్వే ఆపాలని కూడా కేంద్రం చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version