ఎక్కువ సిమ్ కార్డులు కొనే వారికి కేంద్రం షాక్…!

-

సిమ్ కార్డ్ ధృవీకరణలో మోసాలను నివారించడ౦తో పాటుగా టెలికమ్యూనికేషన్ విభాగంలో పదే పదే సిం కార్డ్స్ భారీగా కొనుగోలు చేసే వారిని కట్టడి చేయడానికి గానూ ధృవీకరణ నియమాలను కట్టడి చేసారు. తాజాగా విడుదల అయిన కొత్త నిబంధనల ప్రకారం, టెలికాం కంపెనీ కొత్త కనెక్షన్ ఇచ్చే ముందు కచ్చితంగా ఇచ్చిన అడ్రెస్ ప్రూఫ్ లో నివాసం ఉంటున్నారా లేదా అనేది తనిఖీ చెయ్యాల్సిన అవసరం ఉంది.

అదే విధంగా  ప్రతి 6 నెలలకు ఒకసారి కచ్చితంగా వెరిఫికేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. ఈ విషయంలో కఠినం గా వ్యవహరించాలి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అదే విధంగా… టెలికాం సంస్థల ధృవీకరణకు సంబంధించి… జరిమానా నిబంధనలను సడలించాలని టెలికాం విభాగం నిర్ణయం తీసుకుంది. ప్రతి చిన్న తప్పిదానికి ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే వారు. ఇక నుంచి అలా ఉండదు. ఇక కస్టమర్ వెరిఫికేషన్ నిబంధనలను పాటించనందుకు టెలికం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం 3 వేల కోట్లకు పైగా జరిమానా విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version