కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ… మరియు ప్రపంచంలో 9 టీకాలు ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారు అని, భారతదేశంలో మూడు టీకా తయారి దారులు హ్యూమన్ ట్రయల్స్ లో కీలక దశలో ఉన్నారు అని చెప్పారు. స్టేజ్ -3 క్లినికల్ ట్రయల్స్‌లో ఒక వ్యాక్సిన్ ఉండగా మరో రెండు వ్యాక్సిన్ లు స్టేజ్ – 2 ట్రయల్స్ లో ఉన్నాయని చెప్పారు.
భారతదేశానికి త్వరలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శీతాకాలం మరియు పండుగ సీజన్ కారణంగా కరోనాపై మా పోరాటంలో రాబోయే రెండున్నర నెలలు మాకు చాలా కీలకమైనవి అని ఆయన పేర్కొన్నారు. సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి మనం జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.