మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. తన పుట్టిళ్లయిన చైనాలో మరోసారి విజృంభిస్తోంది. చైనాయే కాకుండా మరికొన్ని దేశాలు ఈ వైరస్ గుప్పిట బిక్కుబిక్కుమంటున్నాయి. మరోవైపు విదేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియెంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరించింది.
పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్నింగ్‌కు పంపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ దేశాల్లో నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచి మార్చి 15 వరకు మూడో వేవ్ ప్రారంభం అవుతుందని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది.
మరోవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా జీరో కొవిడ్ పాలసీని పకడ్బందీగా అమలు చేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ పాలసీని సడలించి ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు అమలు చేస్తోంది.