రామ్ చరణ్ వాడే వాచ్, షూస్ అన్ని కోట్ల రుపాయలా..!

-

టాలీవుడ్ లో మెగా వారసుడిగా అడుగుపెట్టిన రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ సంపాదించుకున్నారు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న చరణ్ తాజాగా అర్ అర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.. అయితే సినిమాలు వ్యక్తిగత జీవితం పరంగా ఎంతగా వార్తల్లో నిలుస్తున్నారు ఆయన తన స్టైలిష్ లుక్ తో కూడా సోషల్ మీడియాలో అంతే వైరల్ గా మారుతున్నారు అయితే తాజాగా రాంచరణ్ వాడే బ్రాండెడ్ వస్తువుల ఖరీదు తెలుసుకున్న వారంతా అమ్మో అంటున్నారు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య ఎక్కడ కనిపించినా స్టైలిష్ లుక్ లో మెరిసిపోతున్నారు.. దీంతో ఆయన వాడే బ్రాండెడ్ వస్తువులపై పెద్ద చర్చ నడుస్తుంది. రామ్ చరణ్ వాడే బ్రాండెడ్ వస్తువుల్లో ముఖ్యంగా ఆయన వాచ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అయితే చరణ్ వాడే వాచ్ కంపెనీ పేరు రిచర్డ్ మిల్లే.. దీని ధర అక్షరాలా 3 కోట్ల 34 లక్షల వరకూ ఉంటుంది. అలాగే ఆయన వాడే నైక్ కంపెనీ షూస్ రేటు అక్షరాలా 3 లక్షల 60 వేలు.. అలాగే చరణ్ వాడే నార్మల్ శాండల్స్ గుచీ చెప్పుల ధరే 5‌0 వేల పైనే ఉన్నాయంటే ఎవరు మాత్రం ఆశ్చర్యపోకుండా ఉంటారు.. ఇది మాత్రమే కాకుండా ఆయన దగ్గర ఇంకా ఎన్నో బ్రాండెడ్ వస్తువులు ఉన్నాయని వాటిలో ధర కోట్ల రూపాయల్లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే రామ్ చరణ్ దగ్గర ఎన్నో కార్లు కలెక్షన్ ఉంది నచ్చితే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి అయినా కార్లను కొంటారంట చరణ్ అలాగే పెంపుడు జంతువుల కోసం కూడా బాగానే ఖర్చు పెడతాడు అంట ఈ హీరో ఇప్పటికే ఇతని దగ్గర గుర్రాలు ఉన్న సంగతి తెలిసిందే.. వీటి మెయింటెనెన్స్ విషయంలో కూడా తగ్గేదే లేదు అంటూ ముందుకు వెళ్తాడు అంట మెగా హీరో.. అయితే రామ్ చరణ్ వాడే ఈ వస్తువుల ఖరీదు తెలుసుకున్న వారంతా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు మెగా హీరో కదా ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే ఎలా అంటూ కొందరు అంటుంటే మరికొందరు మాత్రం అతను వాడే వస్తువులతో ఒక మధ్య తరగతి కుటుంబం కొన్ని ఏళ్లపాటు ప్రశాంతంగా బతికేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version