ఏపీకి కేంద్రం బంప‌ర్ బొనంజా…

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని వైఎస్సార్ పార్టీ  ప్ర‌భుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పేసింది. ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రావాల్సిన నిధుల విష‌యంలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎప్ప‌టికప్పుడు కేంద్రంపై ఏదో ఒక రూపంలో ఒత్తిడి చేస్తూనే ఉంటున్నాడు. కొద్ది రోజులుగా కేంద్ర ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌తో జ‌గ‌న్ ఎంతో సాన్నిహిత్యంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో బీజేపీ నేత‌లు ఏపీపై ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా జ‌గ‌న్ మాత్రం కేంద్రంతో స‌ఖ్య‌త విష‌యంలో ఎక్క‌డా లైన్ దాట‌కుండానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం సానూకూలంగా స్పందించి ఇప్పుడు రాష్ట్రానికి రూ.1734 కోట్ల‌ను విడుద‌ల చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేంద్ర అట‌వీ శాఖ నుంచి కోట్ల రూపాయ‌ల పెండింగ్ నిధులు రావాల్సి ఉంది. ఈ పెండింగ్‌లో ఉన్న నిధుల నుంచి ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం అట‌వీ శాఖ నుంచి రూ.1734 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ చెక్కును ఏపీ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డికి కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప్ర‌కాశ్ జావ‌డేక‌ర్ అంద‌జేశారు.

ఇక తాజాగా ఢిల్లీలో కేంద్ర‌ ప‌ర్యావ‌ర‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలో  అన్ని రాష్ట్రాల అట‌వీశాఖ మంత్రుల సమావేశం గురువారం జ‌రిగింది. ఈ స‌మావేశం కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప్ర‌కాశ్ జావ‌డేక‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రుగగా ఏపీ నుంచి రాష్ట్ర మంతి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల‌కు సంబంధించిన చెక్కును మంత్రికి అంద‌జేశాడు కేంద్ర మంత్రి.

కేంద్రం నుంచి పెండింగ్‌లో నిధులు ఒక్కొక్క‌టిగా విడుద‌ల అయ్యేలా చూస్తామ‌ని వైసీపీ నాయ‌కులు చెపుతున్నారు. తాజాగా కేంద్రం నిధులు విడుద‌ల చేయ‌డం శుభ‌ప‌రిణామం అని కూడా వారు చెపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version