కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి ఉదయం 11 గంటకు వార్షిక బడ్జెట్ (2025-26)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బడ్జెట్ పద్దులలోని అంశాలను ఆమె చదివి వినిపిస్తున్నారు. ఏయే రంగానికి ఎంత కేటాయింపులు చేశామనే విషయాన్ని దేశప్రజలందరికీ తెలియజేస్తున్నారు.
ఇదిలాఉండగా బడ్జెట్ పుణ్యమా అని రైల్వేస్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.ఈసారి రైల్వేలకు భారీ కేటాయింపులు ఉంటాయని టాక్ రావడంతో జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. IRFC LTD, RVNL LTD,IRCON INTERNATIONAL LTD, RAILTEL LTD, IRCTC వంటి షేర్లు 4 శాతానికి పైగా లాభపడ్డాయి.జుపిటర్ వాగన్స్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 19.67 శాతం మేర, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12.55 శాతం, టిటాటర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ 13.27 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.