Breaking : బూస్టర్‌ డోస్‌పై కేంద్రం కీలక నిర్ణయం

-

కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకు పడుతున్న కరోనా రక్కసిని కట్టడి చేసేందుకు బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా వెల్లడించింది. అయితే.. బూస్ట‌ర్ డోస్ వ్య‌వ‌ధిని త‌గ్గిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రెండు క‌రోనా వ్యాక్సిన్లు తీసుకున్న త‌ర్వాత 9 నెల‌ల‌కు బూస్ట‌ర్ డోస్‌ను వేస్తున్నారు. తాజాగా ఈ వ్య‌వ‌ధిని 6 నెల‌ల‌కు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేర‌కు నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ ఇన్ ఇమ్మూనైజేష‌న్ (ఎన్టీఏజీఐ) సిఫార‌సుల మేర‌కు కేంద్రం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

అయితే ఇప్పటికే.. క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ప్రికాష‌న‌రీ డోస్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు మంజూరు చేసింది. ప్ర‌స్తుతం ప్రికాష‌న‌రీ డోస్‌ల‌ను దేశ‌వ్యాప్తంగా ప్రైవేట్ కేంద్రాల్లోనే వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బూస్ట‌ర్ డోస్ వ్య‌వ‌ధిని త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ కేంద్రాల‌కు మ‌రింత మేర వ్యాక్సిన్ల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అడ్వైజ‌రీ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version