డేటా చోరీ: టీడీపీ ఇరుక్కుంటుందా!

-

డేటా చోరీ..ఎప్పుడో 2019 ఎన్నికల ముందు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది..అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజల డేటా చోరీ చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీని ద్వారా టీడీపీకి యాంటీగా ఉన్న ఓట్లని గల్లంతు చేసేందుకు చూశారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది.

టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్‌లో ఉండకూడని డేటా ఉందని, ఆధార్ వంటి డేటా ఉందని, ప్రైవేట్ వ్యక్తుల వద్ద, కంపెనీల వద్ద ఉండని సమాచారం సేవామిత్ర యాప్‌లో ఉందని అప్పట్లో జగన్…టీడీపీపై ఆరోపణలు చేశారు. అలాగే ఈ డేటాచోరికి సంబంధించి..అప్పటిలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక..ఈ డేటా చోరీ అంశం పెద్దగా తెరపైకి రాలేదు. కానీ తాజాగా దీనికి సంబంధించి శాసనసభ ఉపసంఘం భేటీ అయ్యి…డేటా చోరీకి సంబధించి అంశాలపై చర్చించింది. డేటా చోరీ, పెగసస్, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలపై విచారణ కోసం జగన్ ప్రభుత్వం శాసనసభ ఉపసంఘాన్ని నియమించింది. దీనికి ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని పెట్టింది. ఇక దీనికి సంబంధించి భూమన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2016–19 మధ్య పెద్ద కుట్ర జరిగిందని, సేవా మిత్ర యాప్ ద్వారా, టీడీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లే ఉంచి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా యత్నించారని చెప్పుకొచ్చారు. దాదాపు 40 లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారని అన్నారు. కాకపోతే ఈ డేటా చోరీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది క్లారిటీ లేదు..అయితే దీనిపై పూర్తి ఆధారాలతో టీడీపీని ఇరుకున పెట్టాలని వైసీపీ భావిస్తున్నట్లు ఉంది. మరి చూడాలి ఈ డేటా చోరీ ఎపిసోడ్ ఇంకా ఎంతకాలం నడుస్తుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version