ప్రశాంత్ ని టార్గెట్ చేసిన కేంద్రం, బుక్ అయిపోయాడా…?

-

గత కొంత కాలంగా తమకు కంట్లో నలుసు మాదిరి మారిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని కేంద్రం టార్గెట్ చేసిందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ప్రశాంత్ కిషోర్ ఇటీవల కార్గో విమానంలో బెంగాల్ వెళ్లడంపై కేంద్ర సర్కార్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ప్రశాంత్ కిశోర్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి కోలకతా వెళ్ళారు అనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో పౌర విమానయాన శాఖ ఈ అంశంపై దర్యాప్తు మొదలుపెట్టింది. బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నుంచి అత్యవసరంగా ఆయనకు పిలుపు వచ్చింది. దీనితో ఆయన వెంటనే కార్గో విమానంలో అక్కడికి వెళ్ళారు. తాము దీనిపై విచారణ ప్రారంభించామని, లాక్‌డౌన్‌ ఆదేశాలను ధిక్కరించి ప్రశాంత్‌ కిశోర్‌ విమానంలో ప్రయాణించడానికి ప్రయత్నించారా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని…

దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని అన్ని విమానాశ్రయాలను కోరామని పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు చెప్పారు. కోల్‌కతాకు కార్గో విమానాలు నడుపుతున్న విమానయాన సంస్థలను దీనికి సంబంధించి ప్రశ్నలు వేసారు. ఈ వ్యవహారంలో అసలు తమకు ఏ సమాచారం లేదని, తమ ప్రమేయం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. మార్చ్ 22 నుంచి అంతర్జాతీయ విమానాలను,

మార్చ్ 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే అత్యవసర సరుకుల కోసం కార్గో విమానాలు మాత్రం తిరుగుతున్నాయి. మార్చ్ 19 న ప్రశాంత్ బెంగాల్ వెళ్ళారని వార్తలు వచ్చాయి. కాని తాను ఎక్కడికి వెళ్ళలేదు అని ఆయన స్పష్టం చేసారు. దేశ వ్యాప్తంగా 347 కార్గో విమానాలు తిరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version