కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రెడీగా ఉండండి.. రాష్ట్రాలకి కేంద్రం ఆదేశం !

-

అవును వ్యాక్సిన్ పంపిణీకి రెడీగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అంటే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ రాలేదు. ఒక వేళ వస్తే కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే దాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సమన్వయం, పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగే సమయంలో ఇతర ఆరోగ్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని రాష్ట్రలకు కేంద్రం తెలిపింది. ఈ మార్గదర్శకాల మీద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే విషయం మీద మాత్రం ఇప్పటిదాకా సరయిన సమాచారం లేదు. అయితే బీహార్ ఎన్నికల నేపధ్యంలో మాత్రం బీజేపీ కరోనా వ్యాక్సిన్ ప్రచారం అంశం సంచలనంగా మారింది. మరి ఇక ఈ ఆదేశాలు ఎందుకు జారీ చేశారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version