ఇప్పుడు అభివృద్ధి ఏమో గాని గ్రామాలు ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని బ్రతికే పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. పరిశ్రమల నిర్వహణ విషయంలో తీసుకునే కనీస జాగ్రత్తలను కూడా కొందరు తీసుకోకపోవడం ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది. పరిశ్రమలు ఎక్కువగా నగర శివారుల్లో ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఆ ప్రాంతాల్లో కచ్చితంగా కొన్ని జాగ్రతలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి.
కాని ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఆ విధంగా పరిస్థితులు కనపడటం లేదు అనే ఆవేదన వ్యక్తమవుతుంది. చాలా కంపెనీలు అసలు ప్రజల ప్రాణాలను దృష్టి లో పెట్టుకుని వ్యవహరించడం లేదు, కంపెనీలను నడపడం లేదు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. నిన్న చాలా రాష్ట్రాల్లో పరిశ్రమలను తెరిచారు. ఈ సందర్భంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాని అవి ఏమీ లేకుండా నేరుగా పనులు మొదలుపెట్టే సరికి పరిస్థితి అత్యంత భయంకరంగా మారింది. ఏడు రాష్ట్రాల్లో చిన్నా పెద్ద ఘటనలు జరిగాయి.
నా అన్న వాళ్ళను కళ్ళ ముందే కోల్పోయారు జనాలు. ఇప్పుడు దీనిపై కేంద్రం కూడా ఆగ్రహంగా ఉంది. అభివృద్ధి ప్రజల ప్రాణాల మీదకు రాకూడదు అని, ఎవరు అయినా సరే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినా సరే ఇక చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. ఎల్జీ పాలీమర్స్ మీద కేంద్రం చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే నివేదిక కూడా అడిగింది కేంద్రం. అలాగే గ్రామాల నుంచి వెళ్ళే గ్యాస్ పైపుల విషయంలో కూడా ఇప్పుడు కేంద్రం సీరియస్ గానే ఉంది.