మహారాష్ట్ర సిఎం గా ఉన్న ఉద్దావ్ థాకరే తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన నవంబర్ 28 న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఏ సభలో కూడా సభ్యుడు కాదు. ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే అయి ఉంటేనే పదవి చేపట్టడానికి అర్హులు అవుతారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ఇదే విషయాన్ని చెప్పింది. పదవి చేపట్టిన ఆరు నెలల లోపు ఆయన ఎమేల్సీ లేదా ఎమ్మెల్యే అయి ఉండాలి. కాని ఆయన ఎందులో సభ్యుడు కాలేదు. ఎమ్మెల్సీ గా ఎన్నిక కావాలని భావించారు. గత నెల 28 న అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీనితో గవర్నర్ కోటా లో ఆయన్ను ఎమ్మెల్సీ చెయ్యాలి అని భావించారు. కాని అది సాధ్యం కాలేదు.
ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను శాసన మండలి సభ్యునిగా నామినెట్ చేయాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని మంత్రివర్గం కోరినా ఆయన నుంచి ఏ స్పందనా లేదు. గవర్నర్ కోటా లో ఎంపిక చేయడం అనేది గవర్నర్ ఇష్టం. ఆయనకు ఎవరిని చెయ్యాలి అని ఉంటే వారినే చేస్తారు. దీనితో ఇప్పుడు ఉద్దావ్ రాజీనామా చేసే అవకాశం ఉందా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఉద్దావ్ ని ఆయన నామినేట్ చెయ్యాలి అంటే కేంద్రం ఆదేశాలు పరోక్షంగా ఉండాలని, తమను శివసేన మోసం చేసింది కాబట్టి ఎంపిక చేసే అవకాశం లేదని అంటున్నారు.