తెలంగాణా ప్రభుత్వం పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనాపై పోరాటంలో వాళ్ళు చేస్తున్న కృషి ని తెలంగాణా సర్కార్ గుర్తించి వారికి అండగా నిలబడుతుంది ఆర్ధిక ప్రోత్సాహకాలు ఇస్తూ వారి ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎవరికి కూడా కరోనా రాకుండా ఉండటానికి వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది.
కరోనా తీవ్రత పెరుగుతుండం తో వాళ్ళ సేవలు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ప్రతీ రోజు కూడా వారికి సంబంధించిన వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. ఇక తెలంగాణాలో వారి మీద ఒక పాట కూడా విడుదల చేసారు. తాజాగా మంత్రి కేటిఆర్ ఒక వీడియో ని విడుదల చేసారు. ట్విట్టర్ వేదికగా ఒక వీడియో ని పోస్ట్ చేసారు ఆయన. ఈ వీడియో లో పారిశుధ్య కార్మికులు పడుతున్న కష్టాలను వివరించారు.
వాళ్ళు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు, మన ప్రాణాలను కాపాడటానికి గానూ వాళ్ళు ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది వీడియో లో ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో వారు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు అనేది వీడియో లో లెక్కలతో సహా కేటిఅర్ చూపించారు. ప్రతీ ప్రాంతంలో వాళ్ళు చేస్తున్న సేవలు వీడియో లో పొందుపరిచారు. ఎంత మంది ఉన్నారు, ఎన్ని పరికరాలు ఉన్నాయి అనే ప్రతీ విషయం అందులో ఉంది.
My compliments to the outstanding work of #FrontlineWarriors of #GHMC all other Municipal corporations & Municipalities ?#TelanganaFightsCorona#StayHomeStaySafe pic.twitter.com/quZjhTfIkF
— KTR (@KTRTRS) April 28, 2020