ఒకరికి చెత్త అయితే మరొకరికి సంపద..! అవునండి ఒకరు చెత్త అని పనికిరాదని పక్కన పడేసినవాటితో మరొకరు కొత్త ఆవిష్కారాలు చేస్తుంటారు. ఇక ఇదే కోణంలో తెలంగాణ్ లోని నారాయణపేట్ కలెక్టర్ హరి చందన ఇలాంటి పనే చేసింది, ప్రభుత్వం చెత్త అని పక్కన పడేసిన దానిని కలెక్టర్ భలే ఉపయోగించింది అందుకు కేంద్ర మంత్రుల ప్రశంసలు కూడా పొందింది. కలెక్టర్ హరి చందన ఓ పనికిరాని బస్సుని లేడీస్ టాయిలెట్ గా మార్చేసింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వినియోగంలో లేని ఆర్టీసీ బస్సుని మొబైల్ టాయిలెట్ గా మార్చొచ్చని చూపించింది. పనికిరాని బస్సులను ఇలాంటి టాయిలెట్ లుగా మార్చగలిగితే అది ఆడవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ మొబైల్ టాయిలెట్ ను నారాయణపేట జిల్లా కోస్థి పురపాలికలో వినియోగానికి ఏర్పాటు చేశారు. ఇక ఈ విషయాన్ని గమనించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె చేసిన మంచి పనిని అభినందిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. మహిళల కోసం బయోడైజెస్టర్ టాయిలెట్ ఏర్పాటులో కలెక్టర్ హరిచందన చొరవ ప్రశంసనీయం. ఈ గొప్ప ఆలోచన మహిళలకు సౌకర్యంతో పాటు భద్రతనూ అందిస్తుంది అని మంత్రి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కలెక్టర్ కు అభినందన్లు తెలియజేశారు.
Mobile #SheToilets, an innovative idea taken up by Narayanpet collector Ms. Hari Chandana in Telangana is worth appreciation.
This noble initiative will not only provide convenience & safety for women but also sustainability through bio-digesters fitted toilets.#SwachhBharat pic.twitter.com/2MmR6R09tG
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) June 24, 2020
Congratulations @harichandanaias garu for taking the initiative of #SheToilets that is earning accolades for you and the State of #Telangana from all over the country. https://t.co/pisWQORdra
— Santosh Kumar J (@MPsantoshtrs) June 24, 2020