బిగ్‌బాస్ 4 : బిత్తిరి సత్తి పక్కా… మంగ్లీ కూడా

-

ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో త్వరలో బిగ్‌బాస్‌ 4కు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు కంటెస్టెంట్ల వేట మొదలు పెట్టారు. కాగా ప్రస్తుతానికి బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ళ రవిని కన్ఫామ్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బిత్తిరి సత్తి ఇస్మార్ట్‌ న్యూస్‌ నుండి బయటకు రావడం ఈ వార్తలకు బలాన్నిస్తున్నాయి. తీన్మార్‌ వార్తలతో తెలంగాణ ప్రజలకు దగ్గరయిన సత్తి, ఇస్మార్ట్‌ న్యూస్‌తో ఆంధ్ర పల్లెలకు చేరాడు. మొత్తంగా సత్తిని మనం ఇంకా దగ్గరగా చూడబోతున్నామన్నమాట.. కాగా మరోవైపు సింగర్‌ మంగ్లీ అలియాస్‌ సత్యవతి కూడా బిగ్‌బాస్‌కి సెలెక్ట్‌ చేసినట్లు తెలుస్తుంది.

నిజానికి మంగ్లీ బిగ్ ‌బాస్‌ షోకి ఎంపిక చేసి ఉంటే అది ఆ షోకి బాగా ప్లస్‌ అవుతుంది. మంచి మాటకారి గల గల మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి షోలో ఎంటర్‌టైన్మెంట్‌ కూడా పండుతుంది. బిత్తిరి సత్తి, మంగ్లీ కాంబినేషన్‌ వీక్షకులను ఆకట్టుకుంటుందనేది షో నిర్వాహకుల ఆలోచనై ఉండొచ్చు.

కాకపోతే ఈ షో ద్వారా మంగ్లీ ఎమాత్రం ప్లస్‌ అవుతుందో చెప్పలేం.. ఇప్పటికే మంగ్లీకి మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తెలంగాణ పాటలు, ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ కోసం పాడిన పాట, రాజన్నరాజ్యం అంటూ పాడిన పాట బాగా సక్సెస్‌ అయ్యాయి. సంక్రాంతి పాటలతో ఆంధ్రాయువతను చిందులేయించింది మంగ్లీ.. ఇటు తెలంగాణ పబ్లిక్‌ సపోర్ట్‌తో, ఆంధ్ర నుంచి వైసీపీ అండకూడా మంగ్లీకి ఉండొచ్చు. ఇలా అన్నీ బేరీజు వేసుకుంటే ఫైనల్‌కి వెళ్ళే కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది మంగ్లీ.. ఇక గత సీజన్‌లో శివ జ్యోతి కొంతలో మిస్సయ్యింది కానీ ఫైనల్‌కి వెళ్ళాల్సిన పార్టిసిపెంట్‌. శిజ్యోతికి మంగ్లీకి కామన్‌గా ఉన్న ఫ్యాన్‌ బేస్‌కి తోడు మంగ్లీకి ఇంకా ఎడ్జ్‌ ఉండవచ్చని పరిశీలకుల మాట.

Read more RELATED
Recommended to you

Latest news