దామగుండం పర్యటనలో రక్షణ మంత్రి షెడ్యూల్ సడెన్ ఛేంజ్!

-

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంళవారం తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అనుకోకుండా ఆయన వెళ్లాల్సిన దామగుండం పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకు వాతావరణం అనుకూలించకపోవడమే కారణంగా తెలుస్తోంది. దీంతో హెలికాప్టర్ ద్వారా కాకుండా రోడ్డు మార్గంలో వికారాబాద్‌కు పయనం అయ్యారు.

ఈ నేపథ్యంలో రక్షణమంత్రి పర్యటన కాస్త ఆలస్యం కానున్నది. కాగా, నేడు వికారాబాద్ జిల్లా పూడురు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ సెంటర్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.అందుకు సంబంధించి రాడార్ కేంద్రం శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దామగుండం సమీపంలోని ఉందుర్గు తండా లో పైలాన్ ఏర్పాటు చేశారు.అక్కడకు చేరుకున్నాక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాడార్ కేంద్రం ఏర్పాటు పనులను ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version