కేంద్ర కేబినెట్ ఇవాళ కొత్తగా నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ పరిధిలోకి రైల్వే, బ్యాంకు, ఎస్సెస్సీ పరీక్షలను తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మూడు ఏజెన్సీలకు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ద్వారా టైర్-1 ఎగ్జామ్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని, టైర్-1లో సాధించిన స్కోరు మూడేండ్ల వరకు వ్యాలిడిటీలో ఉంటుందని తెలిపింది. ఈ మూడేళ్ల వ్యవధిలో అభ్యర్ధి విభిన్న సంస్థల్లో తనకు నచ్చిన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ రిక్టూట్ మెంట్ ఏజెన్సీనే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది. కేంద్ర కేబినెట్ మీటింగ్ అనంతరం ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే దేశ యువతకు దీంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.