ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన 2026 జనాభా లెక్కల తర్వాతనే అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రస్తుత 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225 స్థానాలకు, తెలంగాణ లోని ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలను 153 స్థానాలకు పెంచాలని సూచించింది “ఏపి పునర్విభజన చట్టం”.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 లో నిర్వహించే జనాభా లెక్కల పూర్తి అయున తర్వాతనే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. కాగా తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన గత కొన్ని రోజులుగా.. ఇరు రాష్ట్రాల నుంచి డిమాండ్ వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ వినిపిస్తోంది.