దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చిరిత్ర గురించి చెప్పాలని ఎన్టీఆర్ బయోపిక్ గా బాలకృష్ణ రెండు సినిమాలు చేశారు. అయితే ఆ రెండు సినిమాలూ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. ఇక రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పరిస్థితి కూడా అంతే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన జీవితంలో జరిగిన మలుపుల గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. ఇక ఆయన జీవిత అంశాల ఆధారంగా వచ్చిన సినిమాలలో కూడా అన్ని వివరాలు చూపించలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం.. మంచు విష్ణు ఒక వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది.
రాజకీయాల నేపథ్యంలో నిర్మితమవుతున్న కారణంగా ‘చదరంగం’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. ఎన్టీ రామారావుని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, ఆయనకి అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు. అందువలన ఈ వెబ్ సిరీస్ కి కథా సహకారాన్ని మోహన్ బాబు అందించారని అంటున్నారు. రాజ్ అనంత ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీ రామారావు పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ 5లో కొద్దీ రోజుల్లోనే ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో చూడాలి.