టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయా..? ఇందులో నిజమెంత..?

-

మనకు మార్కెట్‌లో చాలా సులభంగా లభ్యమయ్యే అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిని నిత్యం అనేక మంది కూరల్లో వాడుతుంటారు. కొందరు పలు ఆహార పదార్థాలను వండేందుకు ఉపయోగిస్తారు. ఇంకా కొందరు సలాడ్స్‌, సూప్‌, జ్యూస్‌ వంటివి చేసుకుని టమాటాలను తీసుకుంటుంటారు. అయితే టమాటాలను ఏ రకంగా తీసుకున్నా మనకు లాభమే ఉంటుంది కానీ, నష్టం మాత్రం ఉండదు. కానీ కొందరు మాత్రం టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయని అంటుంటారు. అయితే ఇందులో నిజమెంత..? నిజంగానే టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయా..? ఈ విషయంపై పరిశోధకులు ఏమంటున్నారు..? అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే…

టమాటాలను తినడం వల్ల కిడ్నీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కానీ.. అది చాలా తక్కువ శాతం మాత్రమే. అసలు కిడ్నీ స్టోన్లు రాని వారు నిర్భయంగా టమాటాలను రోజూ తినవచ్చు. ఇక కిడ్నీ స్టోన్లు వచ్చిన వారు, ఇతర కిడ్నీ సమస్యలు ఉన్నవారు.. మళ్లీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కనుక టమాటాల వినియోగం తగ్గించాలి. దీంతో మళ్లీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. అంతేకానీ.. అసలు కిడ్నీ సమస్యలు లేనివారు, స్టోన్లు అసలు రాని వారు టమాటాలను తీసుకోవచ్చు. వాటిని తీసుకోవడం మానేయాల్సిన పనిలేదని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా కిడ్నీ స్టోన్లు మినరల్స్‌, ఆగ్జలేట్స్‌, కాల్షియం, యూరిక్‌ యాసిడ్‌ నిల్వలు పేరుకుపోవడం వల్ల ఏర్పడుతాయి. అయితే కిడ్నీ స్టోన్లు ఓవర్‌నైట్‌లో తయారు కావు. అవి ఏర్పడేందుకు చాలా కాలం పడుతుంది. అయితే కిడ్నీ స్టోన్లు వచ్చిన వారు మళ్లీ అవి రాకుండా ఉండేందుకు గాను కచ్చితమైన డైట్‌ను పాటించాలి. అందులో భాగంగానే వారు టమాటాలు, పాలకూర వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. దీంతో మళ్లీ కిడ్నీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. ఇక అసలు స్టోన్స్‌ సమస్య లేనివారు ఏ పదార్థాలనైనా నిర్భయంగా తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version